It's A Baby Girl For Alia Bhatt And Ranbir Kapoor
mictv telugu

ఆలియా భట్‌కు పండంటి ఆడబిడ్డ..

November 6, 2022

బాలీవుడ్ యంగ్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులు అయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఆలియా బట్ జన్మనిచ్చింది. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ప్రస్తతం ఆలియ భట్ ఉన్నారు.ఈ శుభవార్తతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక రణబీర్ జంటకు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షులు వస్తున్నాయి.

ఆలియా, రణ్‌బీర్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన కొన్ని రోజులకే… ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో, షూటింగుల్లో పాల్గొంటూ… సందడి చేసింది. బ్రహ్మస్త్రలో ఆలియా రణ్‌బీర్ కలిసి నటించారు.ఇక ఆలియా తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటించింది.