ఆరోజు ఫ్యాన్స్‌కి పండగరోజే: సాయిథరమ్ తేజ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు హీరో సాయిథరమ్ తేజ్ ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మళ్లీ 'జల్సా', 'తమ్ముడు' సినిమాలను థియేటర్లలో రీ రీలీజ్ చేస్తున్నామని సోషల్ మీడియలో వెల్లడించాడు. సెప్టెంబర్ 2వ తేదీన ఆయన అభిమానులంతా మరొక్కసారి ఈలలు వేస్తూ, పవన్ కల్యాణ్ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేయాలని పిలుపునిచ్చారు.
"పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానుల కోసం మళ్లీ 'జల్సా', 'తమ్ముడు' సినిమాలను స్పెషల్ షోస్‌గా వేస్తున్నాం. ముందుగా 'జల్సా' సినిమాను సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తాం. ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ కూడా ఈరోజు విడుదల చేస్తున్నాం. 'పవన్ మావయ్య నుంచి గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్లు రీ రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది'. ఫ్యాన్స్‌కి ఆరోజు పండుగరోజే" అని ఆయన అన్నాడు.
ఇక, పవన్ కల్యాణ్ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా నటించిన 'జల్సా' సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. 2008లో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక, 'తమ్ముడు' సినిమా విషయానికి వస్తే, 1999లో వచ్చిన ఈ సినిమాకి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు పవన్ కెరియర్లో ఎప్పటికీ ముందువరుసలో కనిపించేవే. ఈ సినిమాలను సెప్టెంబర్ 1,2 తేదీలలో మళ్లీ థియేటర్లలో రీ రీలిజ్ చేస్తున్నారు.