ఇది ఒక హ్యాపీ ఎండింగ్.. అశ్వత్థామరెడ్డి  - MicTv.in - Telugu News
mictv telugu

ఇది ఒక హ్యాపీ ఎండింగ్.. అశ్వత్థామరెడ్డి 

November 29, 2019

It's a Happy Ending .. Ashwaththama Reddy

సమ్మెలో పాల్గొన్న టీఎస్ ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం సంతోషంగా, షరతులు లేకుండా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. రేపు కార్మికులంతా ఉద్యోగాల్లో చేరాలని తెలిపారు. లీడర్లుగా చెలామణి అవ్వాలని మాకేం సోకు లేదని చెప్పారు. యూనియన్లను నిర్ములించడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘మేం ఉద్యమం చేసి వచ్చినవాళ్ళం. యూనియన్లలో లేకున్నా మాకు పోయేదేమిలేదు. కార్మికులకు ఉద్యోగ భద్రత, మెడికల్ బెనిఫిట్ కల్పించాలని కోరుతున్నాం. ఇది ఒక హ్యాపీ ఎండింగ్. వాళ్ళు ఓడిపోయారా, వీళ్ళు ఓడిపోయారా అనే చర్చలు పెట్టి కార్మికుల మనోభావాలు దెబ్బతీయొద్దు. కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామంటే సహకరిస్తాం’ అని తెలిపారు. 

ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి సంస్థను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమ్మె వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు అశ్వత్థామరెడ్డి క్షమాపణలు చెప్పారు.