సందీప్ వంగా ఇంట్లో వేడుక.. పండంటి ఆడపిల్ల - MicTv.in - Telugu News
mictv telugu

సందీప్ వంగా ఇంట్లో వేడుక.. పండంటి ఆడపిల్ల

February 27, 2020

Sandeep Reddy Vanga.

‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మరోసారి తండ్రి అయ్యారు. గురువారం ఆయన సతీమణి మనీషారెడ్డి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. తమ మధ్యకు మరో చిన్నారి రావడంతో సందీప్‌రెడ్డి కుటుంబ సభ్యలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014లో సందీప్‌రెడ్డి, మనీషాను వివాహం​ చేసుకున్నారు. వారికి ఇప్పటికే ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. తన కుమారుడికి అర్జున్‌రెడ్డి పేరునే పెట్టుకున్నారు. 

కాగా, సందీప్ టాలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేశారు. అర్జున్‌రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సందీప్ బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమా చేసి తొలి సినిమాతో హిందీలో కూడా హిట్ కొట్టారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మరో సినిమాకు దర్శకత్వం వహించే పనిలో ఉన్నారు.