సనాతన ధర్మంలో ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏదైన శుభకార్యం చేసినా..ఇంటర్వ్యూకు వెళ్లినా..గృహ ప్రవేశం అయినా లేదా పెళ్లి రోజు అయినా..ప్రతి పని సనాతన ధర్మంలో పూజతోనే ప్రారంభం అవుతుంది. కానీ పూజ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు జరగుతుంటాయి. అవి మనల్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని సందర్భంలో అయోమయానికి గురిచేస్తుంటాయి.
ఇది ఇంటర్వ్యూ అయినా లేదా మొదటి రోజు పని అయినా, గృహ ప్రవేశం అయినా లేదా వివాహ వార్షికోత్సవం అయినా, ప్రతి పని సనాతన ధర్మంలో పూజతో ప్రారంభమవుతుంది. కానీ పూజ చేసేటప్పుడు మనకు ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం మీరు చాలా సార్లు గమనించి ఉంటారు, అప్పుడు మనం ఆలోచించడమే కాకుండా వింతగా తికమక పడతాము. పూజ చేస్తున్న సమయంలో కొన్ని వస్తువులు చేతి నుంచి జారికిందపడుతుంటాయి. అయితే వీటిని అశుభసంఘటనలనుగా భావిస్తాం. ఎందుకంటే పూజా వస్తువులు చేతి నుంచి పడిపోతే అశుభమని మన శాస్త్రాలు ఎక్కడా చెప్పలేవు. కానీ మనం పూజచేస్తున్న సమయంలో ఏ వస్తువులు చేతి నుంచి పడిపోతే అశుభంగా భావించాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రసాదం:
పూజ సమయంలో ప్రసాదం చాలా సార్లు మన చేతి నుండి లేదా ప్లేట్ నుండి కింద పడుతుంది. ఇది శాస్త్రంలో అశుభంగా పరిగణిస్తారు. మీకు ఏదైనా ఆటంకం ఏర్పడుతుందన్న భావన మొదలౌతుంది.
అటువంటి పరిస్థితిలో, ప్రసాదం పడిపోయినప్పుడు, వెంటనే దానిని చేతులోకి తీసుకుని నుదుటిపై కొంచెం పూయాలి. మీరు చేతిలో ప్రసాదం పట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
2. దేవుని దీపం:
దేవుడిని పూజించేటప్పుడు దీపం కిందపడటం అశుభంగా భావిస్తారు. మన జీవితంలో ఏదో ముప్పు జరగనుందని సూచిస్తుంది. ఇలా పొరపాటు జరిగితే బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడికి దండం పెట్టుకుని..కిందపడిన దీపాన్ని తీసి మళ్లీ ప్రతిష్టించండి.
3. సింధూరం లేదా కుంకుమ:
సనాతన ధర్మంలో సింధూరాన్ని పూజాప్లేటులో తప్పనిసరిగా ఉంచుతారు. కానీ కొన్నిసార్లు కుంకుమ నేలమీద పడుతుంది. దీన్ని జ్యోతిష్యశాస్త్రంలో అశుభంగా పరిగణిస్తారు. కుంకమ కిందపడిందంటే కుటుంబం లేదా భర్తకు ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. కానీ కుంకుమ కిందపడితే..దానిని చీపురుతో ఊడ్చకూడదు. ఒక గుడ్డతో దగ్గరకు తీసి..పారుతున్న నీటిలో వేయాలి.