Its Just an earnest irony and not intended any other way..RGV another Tweet on Droupadi Murmu
mictv telugu

ద్రౌపది గారిపై నా ఉద్ధేశం అది కాదు.. ఆర్జీవీ మరో ట్వీట్

June 24, 2022

Its Just an earnest irony and not intended any other way..RGV another Tweet on Droupadi Murmu
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం కాక రేపుతున్నాయి. ఓ మహిళపై. అది కూడా రాష్ట్రపతి అభ్యర్థిపై అనుచిత ట్వీట్ చేశారంటూ బీజేపీ నేతలు ఆర్జీవీపై మండిపడుతున్నారు. అబిడ్స్ పీఎస్ లో కంప్లయింట్ కూడా చేశారు. ఈ క్రమంలో తాను చేసిన ట్వీట్ ను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నంగా మరో ట్వీట్ చేశారు. తనకు ఎటువంటి దురుద్దేశం లేదని, మహాభారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని ట్వీట్‌ చేశారు. ద్రౌపది అనే పేరు చాలా అరుదుగా ఉంటుందని, ఆ పేరు వినగానే ఆ పేరుతో ముడిపడిన ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎవరి సెంటిమెంట్‌ గాయపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం అంత తేలికగా వదలడం లేదు. వర్మ ఒక వేస్ట్‌ ఫెలో అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. తాము ఫిర్యాదుపై పోలీసులు కచ్చితంగా చర్య తీసుకుంటారని అన్నారు. గిరిజన మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. మరో బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్.. లక్ష్మణరేఖ దాటొద్దని ఆర్జీవీని హెచ్చరించారు.రాష్ట్రపతి అభ్యర్థిపై చౌకబారు విమర్శలు తగవన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని.. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సూచించారు.