It's not wrong if women show it, but it's wrong if men show it: RGV
mictv telugu

మహిళలు చూపిస్తే తప్పులేదు కానీ, పురుషులు చూపిస్తే తప్పా?: ఆర్జీవీ

July 26, 2022

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవలే ఓ పేపర్ మ్యాగజైన్ కోసం న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫోటోల్లో రణవీర్ సింగ్..శరీరం మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చాడు. ఆ పిక్స్‌ను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలు మహిళ సంఘాలు, మహిళలు తీవ్ర విమర్శలు చేస్తూ, తాజాగా మహిళల మనోభావాలను కించపరిచాడని ముంబైలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో టాలీవుడ్ వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌కు మద్దతు పలికారు. ”మహిళలు తమ శరీరాలను ప్రదర్శించగా లేనిదీ, పురుషులు ఆ పని ఎందుకు చేయకూడదు?. లింగ సమానత్వానికి న్యాయం చేయాలని కోరడం అతని (రణవీర్) మార్గం కావచ్చు. మహిళలు తమ శృంగారాత్మక శరీరాలను చూపించినప్పుడు పురుషులు ఎందుకు చూయించకూడదు? మగవారిని భిన్న ప్రమాణాలతో చూడడం కపటం. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయి” అని రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

మరోపక్క టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొదట ఈ నగ్న ఫొటోల ట్రెండ్‌ని ప్రారంభించాడు. ఈ యువ నటుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విజయ్ ఫస్ట్ లుక్‌ను చిత్రబందం విడుదల చేసింది. అందులో విజయ్.. దాదాపు పూర్తి నగ్నంగా ఉన్నాడు. అయితే, ఆ ఫోటోకు మిలియన్ల కొద్దీ లైకులు, లక్షల్లో కామెంట్లు వచ్చాయి. ఈ లుక్‌పై కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా, మరికొందరు నెగటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. అయితే.. మూవీ టీం ఈ విమర్శలపై స్పందిస్తూ ఈ ఫోజుకి అసలు కారణం సినిమా చూస్తే తెలుస్తుందని తెలిపింది. కానీ.. ఈ పిక్స్ బాగా వైరల్ అవ్వడంతో విజయ్‌ని ఫాలో అవుతూ మరికొందరు నటులు సైతం నగ్న ఫొటోలకి ఫోజులు ఇచ్చారు.