ఇది చూస్తే నవ్వు ఆపుకోలేరు - MicTv.in - Telugu News
mictv telugu

ఇది చూస్తే నవ్వు ఆపుకోలేరు

June 21, 2017

 

ఒక్కో సారి తాడును చూసి అరే….  అచ్చం పాము లెక్కనే ఉంది కదా అనుకుంటం.  కొన్ని సార్లు చీకట్ల ఎవ్వరో ఆ సెట్లల్ల ఉన్నట్లుంది చూడండి అని అంటం… ఇంకా కొన్ని సార్లు  అయితే గేటు కాడ ఏదో నీడ లెక్కనే ఉంది కాస్త ముందుకెళ్లి చూడు అని కూడా అంటం….. ఇంతకు ఇప్పుడే చెప్తున్నారనానే మీరనేది… అయితే ఈ విడియో చూడాల్సిందే…..

మీకు కూడా ఒక్కో సారి  ఇట్ల అయి ఉండొచ్చు. కాలిఫోర్నియాల ఓకామె పక్కింటోళ్లోతాన ఏదో మాట్లాడే వస్తున్నదో లేక పోతే….ఇంటికి పోయే తొందర్లనే ఉన్నదో తెలియదు. అయితే ఇంటి గేటు ముందున్న తాడును ఏదో బొమ్మ అనుకున్నట్లుంది… ఓ సారి చేయితోని తాకి చూసింది… మల్లో సారి పట్టుకున్నది…అప్పుడు తెల్సింది… అది పామని. ఆమె ముందుగాల ఉర్కింది. ఆటెన్క ఆమె కుక్క…. ఓక్కో సారి ఇట్లా  అయితుందటది.