ఇవాంకాను రప్పించుకోవడానికి బాబు విఫలయత్నం... - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాను రప్పించుకోవడానికి బాబు విఫలయత్నం…

November 28, 2017

అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన యత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆమె ఏపీలో పర్యటించడానికి అనుమతివ్వాలని ఏపీ సర్కారును చేసిన వినతిని అమెరికా అధికారులు నిరాకరించారు.

అసలు దీనిపై ఆమెకు సమాచారమే అందలేదని తెలుస్తోంది. ఇవాంకా జీఈఎస్ సదస్సులో హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే.  ఎలాగైనా సరే ఆమెను ఏపీకి  రప్పించాలని బాబు విశ్వప్రయత్నాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎకానమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఈడీబీ) ముఖ్య కార్యదర్శి  కృష్ణ కిషోశ్ ఈ విషయంపై అమెరికా ప్రభుత్వంతో, కాన్సులేట్‌తో  సంప్రదింపులు జరిపారు. అమెరికా అధినేత కూతురు ఏపీకి వస్తే అమరావతి లేదా, వైజాగ్ లలో ఘనంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అయితే షెడ్యూలు ప్రకారం ఇవాంకా జీఈఎస్‌లో మాత్రమే పాల్గొంటారని, మరెక్కడికీ వెళ్లరని అంటూ అమెరికా ఏసీ వినతిని తోసిపుచ్చింది.