ఇవాంకా గోబ్యాక్! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా గోబ్యాక్!

November 28, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌కు వ్యతిరేకంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ప్రజాసంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసన సాగింది.

 

‘ఇవాంకా గో బ్యాక్.. అమెరికా సామ్రాజ్య వాదం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. ‘ఇవాంక ఒక్కదాని కోసం వందల కోట్లు ప్రజా ధనం ఖర్చు చేస్తూ హడావుడి చేస్తున్నారు.. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అబద్దపు.. ప్రచారం చేస్తున్నారు.. విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన పాలకులు కీలుబొమ్మల్లా మారారు.. ’ అని సంఘాల నేతలు విమర్శించారు. వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడానికి పోలీసులు యత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారుల్లో కొందరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోలనలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాలమస కృష్ణ రవిచంద్ర,  మమత , రాణి,సంధ్య  తదితరులు పాల్గొన్నారు.