గోల్కొండను కలవరిస్తున్నఇవాంకా - MicTv.in - Telugu News
mictv telugu

గోల్కొండను కలవరిస్తున్నఇవాంకా

November 30, 2017

జీఈఎస్ సదస్సు కోసం హైదరాబాద్‌కు వచ్చి తన అందచందాలతో,  స్ఫూర్తిదాయన ప్రసంగాలతో అందరి కళ్లను కట్టిపడేసిన అమెరికా అధ్యక్షుడి కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ కళ్లను మాత్రం మన గోల్కొండ కోట కట్టిపడేసింది. మంగళవారం సదస్సులో పాల్గొన్న అనంతరం ఆమె అమెరికా ప్రతినిధులతో కలసి కోటను సందర్శించడం తెలిసిందే. అక్కడి వివరాలను ఆమె ఆసక్తితో తెలుసుకుంది. ఫొటోలు తీయించుకుంది. వావ్.. అంటూ చప్పట్లు కొట్టింది. తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాక కూడా కోట ఆమెకు గుర్తుకొస్తూనే ఉంది. ‘హైదరాబాద్ నుంచి బయల్దేరేముందుకు అమెరికా ప్రతినిధుల బృందంతో కలసి గోల్కొండ కోటను చూశాను. మరపురాని పర్యటనకు ఒక చక్కని ముగింపు…’ అని ఆమె ట్వీట్ చేసింది. గోల్కొండలో తీయుంచుకున్న ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.