ఇవాంకా చీరలను సెలక్ట్ చేసిన సమంత - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా చీరలను సెలక్ట్ చేసిన సమంత

November 27, 2017

హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకకు భారీ కానుకలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వజ్రాల నెక్లెస్ వంటి వాటితోపాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేవి కూడా ఆమె ఖాతాలో పడనున్నాయి.

 సిద్దిపేటలో తయారయ్యే గొల్లభామ చేనేత చీరలు కూడా ఇందులో చేరనున్నాయి. తెలంగాణ చేనేత బ్రాండ్‌ ప్రచారకర్తగా ఉన్న సినీనటి సమంత  ఇవాంకాకు ఇవ్వబోయే చీరను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  గొల్లభామ రకం చీరలను సిద్దిపేటలో 50 ఏళ్లుగా తయారు చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు వీటి ప్రాచుర్యానికి కృషి చేస్తున్నారు. పోచంపల్లి, గద్వాల చీరలు కూడా ఇవాంకాకు ఇస్తారని తెలుస్తోంది.