ఇవాంకా వస్తోంది.. అడ్డం గిడ్డం జరగండి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా వస్తోంది.. అడ్డం గిడ్డం జరగండి..!

November 27, 2017

పెట్టుబడిదారుల సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మెట్రో రైలు ప్రారంభం కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ కు  రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వీఐపీ వాహనాలు వెళ్లే రోడ్లపై ప్రజనలు అనుమతించబోమని, వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు చెప్పారు. ఈ వివరాలతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.

ఆంక్షలు, ప్రత్నామ్నాయ మార్గాలు..

– మియాపూర్ నుంచి కొండాపూర్/ కొత్తగూడ వైపు వెళ్లే వాహనదారులు చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ  గచ్చిబౌలి మీదుగా వెళ్లాలి.

– మియాపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వైపు వెళ్లేfeki  చందానగర్, పటాన్‌చెరు, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలి.

-మాతృశ్రీ నగర్ నుంచి వెళ్లేవారు  శీలా పార్క్ మీదుగా మంజీరా రోడ్డు మీదుగా  వెళ్లాలి.

-పటాన్‌చెరు, ఇక్రిశాట్, బీరంగూడ, ఆర్సీ పురం, అశోక్ నగర్, బీహెచ్ఈఎల్ వైపు నుంచి కూకట్‌పల్లి / హైదరాబాద్ వైపు వచ్చే వాహనదారులు బీహెచ్ఈఎల్ రోటరీ, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, మెహిదీపట్నం మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి.

– జహీరాబాద్, నారాయణఖేడ్, సంగా రెడ్డి నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్ నగరానికి వచ్చే వాహనదారులు ముత్తంగి నుంచే ఔటర్ రింగు రోడ్డు ద్వారా వెళ్లాలి.