మాలియా రొమాన్స్... ఇవాంకా సపోర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మాలియా రొమాన్స్… ఇవాంకా సపోర్ట్

November 25, 2017

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కూతురు మాలియా ప్రేమలో పడింది. ఇంకేముంది మీడియా కళ్లపై ఆమెపైనే పడ్డాయి. ఎక్కడికెళ్లినా కెమెరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను ముద్దాడుతున్న ఫొటోను తీసి టాంటాం వేశాయి. మాలియా సిగరెట్ తాగుతున్న ఫొటోనూ పంచాయి. ఇవేం పెద్ద విషయాలు కావు కానీ.. మీడియాకు వార్తలు ఉండాలిగా. ఈ ఫొటోల ఆధారంగా రకరకాల కథనాలు అల్లాయి. మాలియా పరువును బజారుకు ఈడ్చే ప్రయత్నం చేశాయి.ఈ వ్యవహారంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా, మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూతురు చెల్సియాలు స్పందించారు. మాలియాకు అండగా నిలిచారు.

‘మాలియా మాజీ అధ్యక్షుడి కూతురే కావొచ్చు. కానీ ఆమెకు కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా. ఇలా దొంగచాటుగా ఫొటోలు తీసి నానా హంగామా చేయడం ఏమిటి? ’ అని మండిపడుతున్నారు ఇద్దరూ సోషల్ మీడియాలో. మాలియా ఇప్పుడొక సాధిరణ మహిళ అని, ఆమె వ్యక్తిగత జీవితంలో మీడియా తొంగి చూడకకుండా హద్దుల్లో ఉండాలలని ఇవాంకా ట్వీటింది. మీడియా కాస్త మర్యాదగా ఉండాలి చెల్సియా క్లింటన్‌ హెచ్చరించింది.