పాత గుడ్డలే వేసుకొచ్చిన ఇవాంకా ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

పాత గుడ్డలే వేసుకొచ్చిన ఇవాంకా ట్రంప్

February 24, 2020

Ivanka trump same dress Argentina visit 

విదేశాలకు వెళ్లేటప్పుడు డాబుగా వెళ్లడం చాలామందికి అలవాటు. వీలైనన్ని కొత్త బట్టలు పట్టుకెళ్తుంటారు. మరి అధికార పర్యటనకు వెళ్లేవాళ్లయితే! ఆ దర్జా గురించి చెప్పడానికి మాటలు చాలవు. కానీ కొందరు మాత్రం చాలా నిరాడంబరంగా వెళ్లొస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు ఈ రోజు అహ్మదాబాద్ చేరుకున్న ఆయన తనయ ఇవాంకా అలాంటిదే. కోట్లకొద్దీ డబ్బులు ఉన్నా ఆమె పాత గుడ్డలే వేసుకుని వచ్చింది. పాతవంటే మరీ అంత పాతవేం కాదు లెండి. ఏడాది కిందటో ఆరు నెలల కిందటో కొని ఉంటుంది. 

 

 

View this post on Instagram

 

?? Thank you Argentina! #WGDP ??

A post shared by Ivanka Trump (@ivankatrump) on

భర్త జారెడ్ కుష్మర్‌ను వెంటబెట్టుకొచ్చిన ఇంవాకా బేబీ బ్లూ కలర్‌పై ఎర్ర పూల ప్రింట్లు ఉన్న గౌను వేసుకుని వచ్చింది. చాలా బావుందని జనం మెచ్చుకున్నారు. అది ఆరు నెలల కిందట ఆమె అర్జెంటీనాకు వెళ్లినప్పుడు వేసుకున్న డ్రస్సేనని కొందరు కనిపెట్టారు. ఆ పాత వీడియోలను కూడా సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. అర్జెంటీనాకు వెళ్లినప్పుడు ఆ డ్రస్ వేసుకోవాలని ఆమెకు తండ్రే చెప్పాడట. అమెరికా నేతలు, హాలీవుడ్ తారలు వేసిన  డ్రస్ వేసుకోవడం కొత్తేమీ కాదు. కొత్త హంగుల కంటే ఫ్యాషన్‌కే వారు విలువ ఇస్తారు. బాగున్న డ్రస్సును దశాబ్దాల పాటు వాడేస్తుంటారు. ఈ విషయంలో మన నాయకుల గురించి ఇక చెప్పాల్సిందేమీ లేదు!