ఒకే వేదికపై మంత్రి కేటీఆర్... ట్రంప్ కుమార్తె ఇవాంకా... - MicTv.in - Telugu News
mictv telugu

ఒకే వేదికపై మంత్రి కేటీఆర్… ట్రంప్ కుమార్తె ఇవాంకా…

August 9, 2017

కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. మన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి రామారావుకు ఓ అంతర్జాతీయ సంస్థ సదస్సుకు రావాలని ఆహ్వానించింది. వచ్చే నెల 12వ తేదీన  వాషింగ్టన్ లో  జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో  మాట్లాడాలని యూఎన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ పిలుస్తున్నది. కౌన్సిల్ ఉపాధ్యకుడు ఎమి హరియాని పిల్వనంపుతున్నారు. రామరావుతో పాటు మన దేశానికి చెందిన మరింత మంది ముఖ్యులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, ఇతర వాణిజ్య అంశాలపై చర్చిస్తారు.

ఈ సమావేశంలోనే ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా  మాట్లాడ్తారట. అమెరికా,  ఇండియా దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, వాటి పరిణామ, ప్రభావాలను గురించి  రామరావు నుండి అభిప్రాయాలు తెలుసుకోవాలని  అక్కడి వారు అనుకుంటున్నారట.  మంత్రి హాజరవుతురాని నిర్వాహకులు గట్టి నమ్మకంతో ఉన్నారట.