భార్య అంటే బానిసా..? - Telugu News - Mic tv
mictv telugu

భార్య అంటే బానిసా..?

July 12, 2017

భార్య అంటే ఓ బానిస.. ఒక పనిచేసే యంత్రం,ప్రాణమున్న బొమ్మ,మగాడి ప్రతీ అవసరం తీర్చి..జీవితాంతం జీతం తీసుకోని ఓ పనిమనిషి,ఇదే ఈరోజుల్లో చాలామంది భర్తలకు భార్య అంటే తెలిసిన అర్ధం.మగాళ్ళకు  ధీటుగా ఆడవాళ్లు అన్నిరంగాల్లో దూసుకుపోతున్న ఈరోజుల్లో కూడా ఇంకా చాలామంది ఆడవాళ్లు వంటింటి కుందేళ్లుగానే మిగిలిపోతున్నారు,సినిమాలు,ప్రోగ్రామ్ లు,సీరియళ్లు ఇలా ఏదైనా సరే ..ఆడవాళ్లను చులకన భావంతో చూస్తూ మగాడు తన పైత్యాన్ని..ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు.బంగ్లాదేశ్ లో జరిగిన ఈసంఘటనే అందుకు నిదర్శనం.

ఆ భార్య పేరు హవా అక్తర్..చదువుకునే వయసులోనే అమ్మనాయ్న పెండ్లిచేసి ఓ అయ్య చేతిలో పెట్టారు,పాపం పెండ్లైన తర్వాత తన చదువును పూర్తి చెయ్యాలని ఆశ పడింది,ఆ విషయం భర్తతో చెప్పింది,అవుసరంలేదని ఆ భర్త ఆడర్ వేశాడు,అయినా ఆమె చదువుమీదున్న మమకారంతో డిగ్రీ చేయడం మొదలు పెట్టింది.

అంతే భర్తలో ఉన్న మృగం బైటికి వచ్చింది,నీకో సర్ప్రైజ్ ఇస్తానని  భార్య కళ్లకు గంతలు కట్టాడు,నోటికి ప్లాస్టర్ వేసాడు,భర్త నిజంగానే ఏదో సర్ ప్రైజ్ ఇస్తున్నాడనీ పాపం గుడ్డిగా అతన్ని నమ్మింది,అతను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే భార్య ఐదువేళ్లు అమానుషంగా  కట్ చేసాడు,కట్ చేసిన వేళ్లు దొర్కితే ఎక్కడ దవాఖాన్లకొయ్యి మళ్లీ అంటిపెట్టుకొని ఎక్కడ చదువుకుంటుందో అని ఆ వేళ్లను బైటికెళ్లి దూరంగా చెత్తలో పాడేసాడు,వాడు మనిషా  ఇంకేమనన్ననా ,చీచీ.దౌర్బాగ్యుడు,నీచుడు అని  ఈ వార్త తెల్సినోళ్లందరూ తిడుతున్నారు.ఇలా సాడిష్టుల చేతిలో..అమానుషంగా  చిత్ర హింసలు భరిస్తున్న ఆడవాళ్లకు విముక్తి ఎప్పుడు.ఆడవాళ్లకు  ఇంకెన్నాళ్లు ఈ బానిస సంకెళ్లు ?