రూ. 9 కోట్ల విరాళం ప్రకటించిన రచయిత్రి  - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 9 కోట్ల విరాళం ప్రకటించిన రచయిత్రి 

May 4, 2020

J.K. Rowling donates to coronavirus victims of domestic violence, homeless.

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రముఖులు ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు సామాన్యులు సైతం తమతో అయినంతగా సాయం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా కరోనా సహాయనిధికి హరీపోటర్‌రచయిత్రి జెకె. రౌలింగ్‌(54) ఒక మిలియన్‌ పౌండ్లు ప్రకటించింది. మే 2న హాగ్వార్ట్స్‌ కల్పిత యుద్ధం 22 వార్షికోత్సవం సందర్భంగా 9.5 కోట్లు విరాళంగా ఇస్తున్నటు ప్రకటించింది. వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది హరీపోటర్‌ పుస్తకంలోని పాత్రలైన ఫ్రెడ్‌ వాస్లే, సెవరస్‌ స్నేప్‌, డాబీలను చంపినందుకు క్షమాపణలు చెప్పేది. అయితే ఈసారి మాత్రం ఆ మాటలు లేకుండా విరాళం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

ఈ విషయమై రౌలింగ్ ట్వీట్ చేసింది. ‘హాగ్‌వార్ట్స్‌ యుద్ధం జరిగి నేటికి 22 ఏళ్లు కావస్తోంది. అయితే అదంతా కల్పిత పాత్రల మరణం. ఈసారి దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. నిజమైన ప్రపంచంలో కరోనాతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి సహాయం చేయాలని భావించాను. నేను అందిస్తున్న ఈనిధిని సంక్షోభంతో బాధపడేవారికి, వలస కార్మికులకు సహాయం అందించాలని కోరుతున్నాను’ అని రౌలింగ్ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, రౌలింగ్‌ భర్త నీల్‌ముర్రే వైద్యుడు కావడంతో పాటు ఆమె కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కరోనాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.