ఓ జబర్దస్త్ ఆది.. నీది ప్రోగ్రామా.. పోర్నోగ్రామా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఓ జబర్దస్త్ ఆది.. నీది ప్రోగ్రామా.. పోర్నోగ్రామా ?

June 24, 2017

ఇప్పుడు జబర్దస్త్ హిట్టు లిస్టులో వున్న టీం ‘ హైపర్ ఆది – రైజింగ్ రాజు ’ . ఆది చేసే స్కిట్లో లెక్కలేనన్ని పంచులు పేలుతుంటాయి. అలాగే రైజింగ్ రాజు ప్రెజెన్స్ కూడా ఆది టీంకి చాలా హెల్ప్ ఫుల్ గా వుంటోంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఆది స్కిట్టుకే ఎక్కువ వీవర్స్ వుంటున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వీవర్స్ ఎక్కువగా వున్నంత మాత్రానా అదేదో సమాజానికి పీకి మళ్ళించేదేమీ వుండదనేది వీవర్స్ ని చూసుకొని విర్రవీగేవాళ్ళు తెల్సుకుంటే మంచిది. ఏ టైపాఫ్ వీవర్స్ చూస్తున్నారు ఆ ప్రోగ్రాంని అనేది వాళ్లొకసారి తెల్సుకుంటే జబర్దస్త్ టీం అందరూ ఆ ప్రోగ్రాంని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్యాన్ చేస్తుండొచ్చు.

జబర్దస్త్ లో చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆ ప్రోగ్రాంని చూడగలరా ? వాళ్ల పిల్లలకు వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటివే నేర్పిస్తారా ? అస్తమానూ ఆడవాళ్ళను టార్గెట్ చేయడమే ఆ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం అయిపోయింది. ఈ ప్రోగ్రాం చూసే మహిళలకు వెగటు పుట్టిస్తోంది. తమనీ, తమ మనోభావాలను అత్యంత దారుణంగా ఛీల్చి ఛండాతున్నారని ఆడవాళ్ళు బాధపడుతున్నారు. పూర్తి పురుషహంకారానికి పరాకాష్ట జబర్దస్త్ అని ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పటికే పలు మహిళా సంఘాల నుండి తీవ్ర విమర్శలున్నాయి ఈ ప్రోగ్రాం మీద. అయినా ఈ ప్రోగ్రాం ఆగదు. ఆగిపోయింది.. ఆగిపోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి గానీ షరామామూలుగానే అందులో బూతు కామెడీ డోసు పెంచుకుంటూనే పోతోంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు మరి. ఏది ఆగినా అది మాత్రం ఆగడం జరగదేమో. ఇంట్లో కూర్చొని టీవీ మొహం చూడలేని పరిస్థితుల్లో వున్నారు స్త్రీలు.

ఈ ప్రోగ్రాం వల్ల ఈటీవీకి, రామోజీరావుకు, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డిలకు, అందులో స్కిట్లు వేసే కమెడియన్లకు చాలా లాభాలు వుండొచ్చు కానీ వాళ్ళ శృతిమించిన వరస్ట్ కామెడీ వల్ల ఆడవాళ్ళు ఎంత అవమానానికి గురౌతున్నారో ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటే చాలా చాలా బాగుంటుంది. కామెడీ పండాలంటే వల్గారిటీయే దానికి ప్రామాణికమా ? హిందీలో ‘ కామెడీ నైట్స్ విత్ కపిల్ ’ ప్రోగ్రాంలా కంప్లీట్ నీట్ కామెడీతో మన వాళ్లకు ప్రోగ్రాంలు డిజైన్ చేయరాదా ? వర్గల్ స్కిట్లు వేస్తేనే జనాలు నవ్వుకుంటారని వాళ్ళకు వాళ్ళు డిసైడైపోయే పరమ రోస్ట్, రోత కామెడీని ఇంకెంత కాలం కొనసాగిస్తారని స్త్రీ సంఘాలు గుస్సా మీద వున్నాయి.

ఇప్పటికే ఈ ప్రోగ్రాం వల్ల చాలా మంది యూత్ డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేస్తున్నారు. ముందు ముందు ఇంకెంత దారుణంగా వుంటుందో పరిస్థితని మనం అంచనా వెయ్యొచ్చు. బూతు లేకుండా నీట్ గా నవ్వుకోలేమా ? అలా నవ్వించడం కమెడియన్లకు రాదా ? జబర్దస్త్ లో చేసినవాళ్ళంతా సినిమాల్లో బిజీ అయినంత మాత్రానా వాళ్ళంతా పెద్ద తురుంఖాన్ లా ? ఆదీకి వర్సగా 40 సినిమాలకి రాయమని అవకాశం వచ్చిందటే.. ఇంకే ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలుగు సినిమాలను కూడా భ్రష్ఠు పట్టించే బాధ్యతను భుజాలమీదేస్కుంటున్నాడన్నమాట. ఈ ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు ఆడవాళ్ళకున్న ఆ కాస్త విలువ, గౌరవం కూడా వుండకుండా సంకనాకి పోతుందనేది పక్కా నిజం !