Jabardast comedian Panch Prasad fell seriously ill
mictv telugu

నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. సాయం కోసం ఎదురుచూపులు

November 18, 2022

జబర్దస్త్ షోలో తనదైన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించిన పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నడవలేని స్థితికి చేరి కనీసం ఆయనకు వచ్చిన జబ్బు ఏంటో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రసాద్.. ఆ వ్యాధి ఉన్న తనపై కూడా పలు షోలలో పంచులు వేసి నవ్వులు పంచాడు. ప్రతీవారం డయాలసిస్ చేసుకుంటున్నా తన బాధను బయటకు చెప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడు నడవలేని పరిస్థితికి చేరాడు.

ఆయన యూట్యూబ్ ఛానెల్ లో కమెడియన్ జోడీ నూకరాజు వ్లాక్ చేసి ప్రసాద్ ఆరోగ్య స్థితిని వీడియో తీసి పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పడానికి ప్రసాద్ ఇష్టపడలేదు. అయినా చాటుగా వీడియో తీసి చూపించాడు నూకరాజు. ‘ఓరోజు షూటింగ్ తర్వాత జ్వరంగా ఉందని ఇంటికి వచ్చి నడుము నొప్పితో బాధపడ్డాడు. నడవలేక ఇబ్బంది పడ్డాడు. డాక్టర్లకు కూడా మొదట ఏం జరిగిందో అర్ధం కాలేదు. టెస్టులు చేసిన తర్వాత నడుము వెనకాల కుడికాలి వరకు చీము పట్టినట్టు తెలిసింది’ అని ప్రసాద్ భార్య వెల్లడించింది. ఆమె మాటలను ప్రసారం చేసిన నూకరాజు.. అభిమానులు స్పందించి సపోర్ట్ చేయాలని కోరాడు.