రైల్లో జబర్దస్త్ టీమ్ రౌడీయిజం - MicTv.in - Telugu News
mictv telugu

రైల్లో జబర్దస్త్ టీమ్ రౌడీయిజం

April 25, 2018

జబర్దస్త్ కామెడీ షోలో బూతులు తిట్టుకోవడం, కొట్టుకోవడం కామనే. కానీ అది షో. బయట కూడా అలాగే చేస్తే పోలీసులు ఊరుకోరు. విశాఖపట్నంలో ఇది నిజమైంది. జబర్తస్ట్ టీఎం నటులు జనరల్ బోగీ టికెట్లు కొనుక్కుని జబర్దస్త్‌గా థర్డ్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించి హల్ చల్ చేశారు. అడ్డుకున్న టీసీపై దౌర్జన్యానికి దిగారు. టీసీకి వెనక్కి తగ్గకపోవడంతో తర్వాత తోకముడిచారు.

 

హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్లో జబర్తస్త్ టీం జనరల్ టిక్కెట్ల తీసుకుంది. జనరల్ బోగీల్లో స్థలం లేదనో, లేకపోతే మరో కారణం వల్లో అందరూ పోలోమని థర్డ్ క్లాస్ ఏసీ బోగీ ఎక్కారు. రైలు వైజాగ్ చేరాక వీరి వ్యవహారం బట్టబయలైంది.  టీసీ అభ్యంతరం చెప్పాడు. దీంతో నటుడు షేకింగ్ శేషు సహా పలువురు టీసీతో గొడవ పెట్టుకున్నారు. వారి మాటలను బట్టి.. నటులు టీసీపై చెయ్యిచేసకున్నట్లు, అతడు వారిని యూజ్ లెస్ అని తిట్టినట్లు తెలుస్తోంది. టీసీ వారిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా కూడా అక్కడికి చేరుకోవడం జబర్దస్త్ వెనక్కి తగ్గింది.