jabardasth Anchor Rashmi Gautam Serious Commnets On Tamil Comedian Santhanam
mictv telugu

స్టార్ కమెడియన్‌పై యాంకర్ రష్మీ ఆగ్రహం..!

December 29, 2022

anchor rashmi serious on tamil comedian santhanam

‘జబర్దస్త్’ షోతో బుల్లితెర స్టార్ యాంకర్‌గా మారిన రష్మీ గౌతమ్ మంచి జంతు ప్రేమికురాలని కూడా తెలిసిందే. మూగ జీవాలను హింసించవద్దని సోషల్ మీడియా ద్వారా సందేశాలు ఇస్తూనే ఉంటుంది రష్మీ. ఆమె చేసే ట్వీట్లలో 80 శాతం మూగజీవాలకు సంబంధించినవే. వీధికుక్కలను దత్తత తీసుకోవడం, వాటికి ఆహారం ఇవ్వడం, జంతు వధను వ్యతిరేకించడం వంటి వీడియోలని రష్మీ షేర్ చేస్తుంది. ఈ క్రమంలో మూగజీవాలను దెబ్బతీసే వారిపై కూడా విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా తమిళ నటుడు, స్టార్ కమెడియన్ సంతానంపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత్తులో ఉన్న పులి పక్కన కూర్చుని తోక ఊపుతున్న వీడియోను సంతానం ట్వీట్ చేయటంపై రష్మీ మండిపడింది.

సంతానం పులి వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. అయితే సంతానం ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నాడు. వెళ్లిన ఆ ప్లేస్ ఏంటో మెన్షన్ చేయలేదు కానీ.. ఆ వీడియోలో అతను నీరసంగా పడుకున్న పులి తోక పట్టుకుని ఊపుతూ.. పులి పడుకుందా? అని అడగ్గానే, అక్కడున్న వ్యక్తి ఎలక్ట్రిక్ స్టిక్ తో షాకిచ్చి పులిని లేపుతాడు. ఇప్పుడు ఇదే వీడియోపై రష్మీ రియాక్ట్ అవుతూ.. “సరదా కోసం ఏ జంతువునైనా హింసించడం, చంపడం తప్పు. డ్రగ్ ఇచ్చిన ఒక జంతువు పక్కన కూర్చొని ఇలాంటి ప్రదేశాలను ఇండైరెక్ట్ గా ప్రోమోట్ చేస్తున్నారని సంతానం గ్రహించాలి. ఒక జంతువుని ఇలా దాని జీవన విధానానికి దూరం చేయడం కరెక్ట్ కాదు’ అని ట్వీట్ చేసింది రష్మీ.

ఇవి కూడా చదవండి :

వీరయ్య శివదూషణ వివాదం.. ఎట్టకేలకు చంద్రబోస్ వివరణ..!

22ఏళ్ళ తరువాత మరో సంచలనం.. మెగా మాస్ సాంగ్ పూనకాలు రిలీజ్..!

ఇండస్ట్రీ పెద్దరికంపై మరోసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం