జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంతో మరింత పాపులర్ అయిన నటి రీతూ చౌదరి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఆమె తన కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాక, తమ బంధం కంటే తమకు ఏదీ బెటర్ కాదని క్యాప్షన్ పెట్టింది. ఆమె కాబోయే భర్త పేరు శ్రీకాంత్ కాగా, పలువురు ఆమెకు విషెస్ చెప్తున్నారు. ఇదిలా ఉండగా, హైపర్ ఆది టీంలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన రీతూ.. అంతకు ముందు గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకులను కట్టిపడేసే నవ్వుతో జబర్దస్త్‌లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయి తన గ్లామర్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారు మనసులో చోటు సంపాదించింది.