తండ్రిగా ప్రమోషన్ పొందిన జబర్ధస్త్ వినోదిని.. - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రిగా ప్రమోషన్ పొందిన జబర్ధస్త్ వినోదిని..

June 2, 2022

జబర్దస్త్‌ కామెడీ షో లో లేడీ గెటప్‌లు వేస్తూ.. ఫేమస్ అయిన వారిలో వినోద్ ఒకడు. చాలామందికి వినోద్ అంటే తెలియదు కానీ వినోదిని అనగానే టక్కున గుర్తుపట్టేస్తారు. చమ్మక్ చంద్ర స్కిట్‌లలో అచ్చం అమ్మాయిల్లాగే నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా వినోద్.. అలియాస్ వినోదిని.. ఓ ఆడ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోను షేర్ చేశాడు. తనకి ఆడబిడ్డపుట్టిందని.. చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు వినోద్. గత ఏడాది లాక్ డౌన్‌ టైంలో జబర్దస్త్ వినోద్ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కడప జిల్లాకి చెందిన తన మేనత్త కూతురు విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వినోద్.

అయితే జబర్ధస్త్‌లో లేడి గెటప్స్ వేసిన చాలామంది బయట ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ దాటుకుంటూ.. అవమానాలను భరిస్తూ.. మేమూ మీలాంటి మనుషులమే.. మాకూ భార్య పిల్లలు ఉన్నారంటూ పలు సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు ఆ కమెడియన్లు. ప్రస్తుతం వాటన్నింటిని దాటుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.