jabardasth emmanuel buy a new car
mictv telugu

ఇమాన్యుయేల్ కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే..

November 2, 2022

బుల్లితెర పాపులారిటీ కామెడీ షో ‘జబర్దస్త్’. ఈ షో ఆర్టిస్టులకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో వీళ్ల క్రేజ్ ఎక్కువే. ఈ షో నుంచి
సెలెబ్రిటీసే కాదు ఆస్తిపరులు కూడా అవుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ కూడా కొత్త కారు కొనుగోలు చేశాడు. ‘హ్యుండాయ్ వెన్యూ’ కారును కొన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

చివరకు నేను కన్న కల నిజమైంది.. నా లైఫ్‌లో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు.. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. మీ అందరి ప్రేమ, మద్దతకు థాంక్స్” అంటూ ఇమాన్యుయేల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇమాన్యుయేల్ పోస్ట్‌కు కంగ్రాట్స్ చెబుతూ పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

ఇటీవల కాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్, టీవీ9 యాంకర్ అయిన శివ జ్యోతి బెంజ్ కారు కొనుగోలు చేసింది.పవిత్ర, రచ్చ రవి, షన్ను, ‘బిగ్ బాస్’ హమీద వంటి వారు కొత్త కార్లు కొని తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ కూడా కొత్త కారు కొనుగోలు చేశాడు.