Jabardasth Judge Indraja Controversial Comments On Krishna Bhagavan
mictv telugu

జబర్దస్త్ లో మరో వివాదం.. కృష్ణ భగవాన్ కి అవమానం.. ఇంద్రజపై విమర్శలు ?

October 30, 2022

9ఏళ్లుగా బుల్లితెరని ఏలుతున్న టీవీ షో జబర్దస్త్. నాగబాబు, రోజా, యాంకర్ అనసూయ, సుధీర్ వంటి స్టార్స్ జబర్దస్త్ నుండి వెళ్లినా క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. అదే రేటింగ్స్, అవే వ్యూస్. నాగబాబు, రోజా, అనసూయ తరువాత జబర్దస్త్ బ్రాండ్ ని ఇంద్రజ, రష్మీ మోస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇంద్రజ. అడల్ట్ షోగా ఒక వర్గం ట్రోల్ చేసే జబర్దస్త్ కి ట్రెడిషినల్ టచ్ ఇచ్చి తనకంటూ సపరేట్ క్రేజ్ తెచ్చుకుంది ఇంద్రజ. సాంప్రదాయ లుక్స్ లో ఇంద్రజ మెప్పిస్తూ వస్తుంది. అయితే ఈమెకి తోడుగా టాలీవుడ్ సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ మరో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆఫ్ ది స్క్రీన్ బూతు జోక్స్ వేయటంలో కృష్ణ భగవాన్ కి అలీ అంతటి పేరుంది. అయితే అలాంటి ఈ సీనియర్ కమెడియన్ పై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణభగవాన్ డాన్స్ వరస్ట్ అని అనేసింది. ఇదంతా తాజాగా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో గమనించొచ్చు.

ప్రతి వారం మాదిరే తాజాగా ప్రోమో వదిలారు జబర్దస్త్ నిర్వాహకులు. ఆ ప్రోమో అంతా ఫుల్ ఎంటర్టైనింగ్ గానే సాగింది. కానీ.. మధ్యలో ఓ కమెడియన్ స్టేజి పైకి వచ్చి.. సూపర్ మచ్చి పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇంద్రజ మైక్ అందుకొని ఆ కమెడియన్ పై సెటైర్ వేసింది. ‘కింద ఏం తవ్వుతున్నావ్.. ఒకటే తవ్వకం’ అంటూ ఇంద్రజ నవ్వేసింది. ఇంతలో పక్కనున్న జడ్జి కృష్ణభగవాన్ ఇంద్రజ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ.. ‘అయినా బాగుంది’ అన్నాడు. దీంతో ఇంద్రజ కృష్ణభగవాన్ కి మరో కౌంటర్ ఇచ్చేసింది. అయినా బావుంది అన్న కృష్ణభగవాన్ డాన్స్ ని ఉద్దేశిస్తూ.. “అంతకంటే వరస్ట్ గా ఈయన డాన్స్ చేస్తారు. కాబట్టి బాగుంది అంటున్నారు” అని కృష్ణభగవాన్ ని చూపించింది. అయితే కృష్ణభగవాన్ అస్సలు డాన్స్ వేయలేడు. నిజానికి కృష్ణభగవాన్ కి డాన్స్ బాగానే వస్తుంది. కానీ అతని ఆరోగ్యం సహకరించక స్టెప్స్ వేయలేకపోతున్నారు. అతని అనారోగ్యం దృష్ట్యా డాన్స్ వేయలేకపోవటాన్ని కూడా కామెడీ చేయాలా అంటూ ఇంద్రజపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇంద్రజ జోక్ చేసినా.. కనీసం వయసుకి మర్యాద ఇవ్వాలి కదా అని కామెంట్స్ వస్తున్నాయి. ‘అయితే ఇదంతా జబర్దస్త్ లో కామన్, రేటింగ్ కోసం వారు ఏదైనా చేస్తారు లైట్’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.