Jabardasth New Anchor Soumya Life History
mictv telugu

మా నాన్న మోసం చేశాడు.. ‘జబర్దస్త్` కొత్త యాంకర్‌ కన్నీళ్లు

November 20, 2022

నవ్వులు పూయించే ఎంతోమంది కమెడియన్స్ జీవితాల్లో చెప్పుకోలేని కన్నీటి కథలు ఉంటాయి. ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు వారిని పట్టి పీడిస్తుంటాయి. కానీ ఆ బాధని గుండెల్లో దాచుకుని మనకి నవ్వులు కురిపిస్తారు. కమెడియన్స్ ని ఎక్స్ పోర్ట్ చేసే పాపులర్ టీవీషో జబర్దస్త్ లోని నటుల కష్టాలు సైతం వర్ణనాతీతంగా ఉంటాయి. జబ్బులతో, ఆర్థిక సమస్యలతో ఎంతోమంది బాధపడుతూనే స్కిట్స్ వేస్తుంటారు. అలాంటి షోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది యాంకర్ సౌమ్య. అనసూయ ఎగ్జిట్ తో కాలి అయిన స్థానాన్ని తన నాజూకు అందాలతో భర్తీ చేస్తుంది సౌమ్యరావు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ని సైతం చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. భాషలో గమ్మత్తు, కాన్ఫిడెన్స్, స్లిమ్ అందాలు అప్పుడే సౌమ్యని ప్రేక్షకులకి దెగ్గరచేశాయి. సౌమ్య సమ్ థింగ్ స్పెషల్ అంటూ కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే అనూహ్యంగా యాంకర్ సౌమ్య తెరవెనుక జీవితం గురించి తెలిసి అందరు షాక్ అవుతున్నారు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి విన్నవారికి హృదయాలు బరువుక్కుతున్నాయి.

జబర్దస్త్ కంటే ముందు మరో టీవీషో చేసింది సౌమ్య. హైపర్ ఆదితో కలిసి అందులో రచ్చ చేసింది. ఆ పర్ఫార్మెన్సే జబర్దస్త్ కి దారులు తెరిచింది కూడా. అయితే ఆ షోలో యాంకర్ ప్రదీప్ ఆమె ఫ్యామిలీ గురించి చెప్పమంటే నేను చెప్పను అంటూ అందరికి షాక్ ఇచ్చింది. ప్రదీప్ మళ్ళీ అడగటంతో తన భయంకర ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసింది సౌమ్య. `నా లైఫ్‌ గురించి చెప్పను. నాకు అమ్మలేదు. నాన్న ఉండి కూడా లేడు. మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం నేను ఓ అనాథని, నాకు ఎవరూ లేరు. ఇక్క ఉన్న వారందరికి అమ్మనో, నాన్ననో, బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు. కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను` అని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య రావు. అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక కన్నడకి చెందిన సౌమ్య రావు మోడలింగ్‌ నుంచి టీవీ రంగంలో అడుగుపెట్టింది.