బుల్లితెరపై తెగ సందడి చేసే ‘జబర్దస్త్’ ప్రేమజంట రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత పెళ్లయిపోయింది. పలువురు సెలబ్రిటీలు, స్నేహితుల సందడి మధ్య వీరు తిరుమలలో శుకవ్రారం పెళ్లాడేశారు. కొన్నేళ్లు ప్రేమించుకుంటున్న తాము వివాహబంధంతో ఒక్కటి కాబోతున్న వీరు ఇటీవల ప్రకటించడం తెలిసింది. పెళ్లికి ఏపీ మంత్రి, నటి రోజా, యాంకర్ రవి తదితర బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. కడుపుబ్బా నవ్వించే రాకింగ్ రాకేశ్ ‘జబర్దస్త్’ ద్వారా, తెలంగాణ యాసతో వార్తలు చెప్పి ఆ తర్వాత బిస్ బాస్ కంటెస్టంటు మారి సుజాత పేరు తెచ్చుకున్నారు. వీళ్లిద్దరూ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటారు. ప్రోగ్రాములతో బాగానే డబ్బు వెనకేసున్న వీరు ఇంకెందుకాలస్యం అని పెళ్లిపీటలెక్కారు. ఇద్దరి కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో శుభం కార్డు పడిపోయింది.