Jabardasth tv program actor mimicry murthy passed away
mictv telugu

జబర్దస్త్ టీమ్‌లో విషాదం.. మిమిక్రీ మూర్తి కన్నుమూత..

September 27, 2022

Jabardasth tv program actor mimicry murthy passed away

బుల్లితెరపై వినోదం పంచుతున్న తెలుగు ప్రోగ్రామ్ జబర్దస్త్ టీమ్‌లో విషాదం నెలకొంది. ఎన్నో ఎపిసోడ్లలతో హాస్యాన్ని పండించి ప్రేక్షకులను అలరించిన నటుడు మిమిక్రీ మూర్తి మంగళవారం హన్మకొండలో కన్నుమూశారు. ఆయన పాంక్రియాస్ కేన్సర్‌తో చనిపోయినట్లు సోదరుడు అరుణ్ వెల్లడించారు.

మూర్తి కేవలం టీవీ కార్యక్రమాల్లోనే కాకుండా పలు వేడుకల్లోనూ తన మాంత్రిక స్వరంతో ఆకట్టుకున్నారు. ఆయన తన అనారోగ్యం నుంచి బయటపడ్డానికి పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. వైద్యం కోసం మూడేళ్లల 16 లక్షలు ఖర్చు పెట్టారు. కొన్నాళ్లుగా బంధుమిత్రుల ఆర్థిక సాయంతో రోజులు నెట్టుకొస్తున్నారు. నిండైన విగ్రహంతో ఉండిన మూర్తి వ్యాధివల్ల చిక్కి శల్యయ్యారు. మూర్తి మరణానికి బుల్లితెర ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.