ట్విట్టర్ కు పోటీ వచ్చేసింది. దీనికి ధీటుగా మరొక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఎలాన్ మస్క్ కు ఝలక్ ఇస్తూ ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే బ్లూ స్కై యాప్ ను రంగంలోకి దించారు.
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే మళ్లీ సోషల్ మీడియా ఎరీనాలోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం బ్లూస్కైను లాంఛ్ చేశారు. ప్రస్తుతం ఇది ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అక్కడ కూడా ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే యాక్సెస్ ఉంది. బ్లూస్కై ఇప్పటివరకైతే టెస్టింగ్ ఫేజ్‌లో ఉంది. ప్రయోగాత్మకంగా దీనిని పరిశీలించాక అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక టెక్‌క్రంచ్ ప్రకారం.. బ్లూస్కై అనేది ఒక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం. ప్రస్తుతానికి బీటా వెర్షన్ మాత్రమే విడుదలైంది.
డాటా ఏఐ యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ వివరాలను బట్టి.. iOS యాప్ స్టోర్‌లో బ్లూస్కై ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్ దశలోనే 2000 మంది వరకు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దీని యూజర్ ఇంటర్‌ఫేజ్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంది. యాప్‌లో ఉండే ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి.. 256 క్యారెక్టర్లతో పోస్ట్‌ను క్రియేట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఫొటోస్‌తో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ లో వాట్ ఈస్ హ్యాపినింగ్ అనే ఉండే చోట బ్లూ స్కైలో వాట్సప్ గా కనిపిస్తుంది.
షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఫీచర్లతో పాటు యాడింగ్ అకౌంట్స్ లాంటి కొత్త టెక్నిక్స్ ను బ్లూస్కై పరిచయం చేయనుంది. ఇవేకాక ఇంకా చాలానే కొత్త కొత్త వాటిని తీసుకొచ్చే దిశగా బ్లూస్కై దానిపై పనిచేస్తోందట. యాప్ నావిగేషన్స్ మధ్యలో డిస్కవర్ ట్యాబ్‌ను బ్లూస్కై తీసుకొచ్చినట్లు డేటా.ఏఐ తెలిపింది. ఎవరిని ఫాలో చేయాలి? రీసెంట్ పోస్ట్‌లు లాంటి వాటి గురించి తెలుసుకోవడానికి నావిగేషన్ ఉపయోగపడుతుంది.ఇక వేరే ట్యాబ్‌లో నోటిఫికేషన్స్, లైక్స్, రీపోస్టులు, రిప్లైలు, ఫాలోస్.. ఇలా ట్విట్టర్‌లో ఉన్నటువంటి ఫీచర్లు ఉన్నాయి.యూజర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ప్రొఫైల్ పిక్, బ్యాగ్రౌండ్, బయో మెట్రిక్స్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
బ్లూస్కై అనే ప్రాజెక్ట్ 2019లో ట్విట్టర్‌లోనే ప్రారంభమైంది. 2022లోనే ఉనికిలోకి వచ్చింది. ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు అయిన జాక్ డోర్సేనే.. ట్విట్టర్ నుంచి బయటికి వచ్చాక దీని గురించి మాట్లాడారు కూడా. సామాజిక మాధ్యమ ప్రాథమిక అంశాలు,యూజర్ల డేటా సొంతం చేసుకోవాలని భావిస్తున్న కంపెనీలు బ్లూస్కై ప్రత్యామ్నాయంగా, పోటీగా ఉంటుందని చెప్పారు. పరోక్షంగా ఇది మస్క్‌ను ఉద్దేశించి చేసినట్లేనని చాలా మంది అనుకున్నారు కూడా.