తలపై పనస పండు పడింది..కరోనా బయట పడింది
కరోనా వైరస్ లక్షణాలు సోకినా వెంటనే కనిపించవని తెల్సిందే. కరోనా వైరస్ సోకినా తరువాత కొందరికి 14 రోజుల నుంచి 28 రోజుల వరకు లక్షణాలు కనిపించవు. ఈ క్రమంలో కేరళలో ఓ వింత సంఘటన జరిగింది. బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ పై మే19న పనస పండు కోసం చెట్టు ఎక్కాడు. అయితే దురదృష్టవశాత్తు అతడిపై ఓ పనస పండు పడింది. అతడు చెట్టుపై నుంచి కింద పడడంతో.. వెన్నెముక, మెడకు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స కోసం అతడిని కసరగడ్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి పరియార్‌లోని కన్నూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అతడికి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులతో పాటు 18 మందిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.