జడ్చర్లలో.. పిల్లాడు స్కూలుకెళ్లలేదని 100కు ఫోన్  - MicTv.in - Telugu News
mictv telugu

జడ్చర్లలో.. పిల్లాడు స్కూలుకెళ్లలేదని 100కు ఫోన్ 

July 18, 2019

పొరపాటున 100 నంబరుకు డయల్ చేసేవాళ్లు కోకొల్లలు. చేయబోతూ కాల్ కట్ చేసేవాళ్లు మరికొందరు. ఆపదలో ఆదుకునే ఆ నంబరును కొందరు అమయాకత్వంతో ఎలా వాడుకుంటున్నారో చెప్పే తాజా ఉదంతం ఇంది. తన కొడుకు స్కూలుకు వెళ్లకుండా మారాం చేస్తున్నాడంటూ ఓ మహాతల్లి 100కు డయల్ చేసి పారేసింది. తన కొడుకు సతాయిస్తున్నాడని, తక్షణమే వచ్చి సాయం చేయాలని కోరింది. పెట్రోలింగ్ పోలీసులు ఏం జరిగిందో ఏమోనని హుటాహుటిన అక్కడికి చేరుకుని విషయం తెలుసుకుని తలపట్టుకున్నారు. జడ్చర్ల పట్టణంలో ఈరోజు జరిగిందీ తతంగం. పోలీసులు వచ్చాక వారితో తల్లి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బాబు బడికి పోవడం లేదని డయల్ 100కు కాల్ చేసిన తల్లి

Posted by Rajendra Kommineedi on Wednesday, 17 July 2019

‘స్కూలుకు పోకపోతే 100కు కాల్ చేస్తావా?’ అని పోలీసులు అడగ్గా, ‘ఏం చేస్తాం సార్. అస్సలు పోవట్లేదు.. ’ అని తల్లి చెప్పుకొచ్చింది. పోలీసులు మొదట విసుక్కున్నా, తర్వాత నవ్వుకుని అబ్బాయికి సుద్దులు చెప్పి బడికి తోలారు. ఈ వీడియోపై బోలెడు జోకులు పేలుతున్నాయి. పోలీసులు ఇలాంటివాటికైనా పనికొస్తున్నందుకు సంతోషంగా ఉందని కొందరు సటైర్లు వేస్తుండగా, విలువైన పోలీసులు సమయాన్ని ఇలా వృథా చేయడం సరికాదని కొందరు అంటున్నారు.