విజయవాడ నుండి పోటీ చేసినా గెలుస్తానంటున్న మంత్రి జగదీష్ రెడ్డి ! - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడ నుండి పోటీ చేసినా గెలుస్తానంటున్న మంత్రి జగదీష్ రెడ్డి !

July 22, 2017

వహ్వా.. మంత్రి జగదీష్ రెడ్డిది ఏమన్న కాన్ఫిడెన్సా ? రానున్న ఎలక్షన్ లల్ల మీరు సూర్యాపేట నుండి పోటీ చేస్తరా ? లేకపోతే వేరే నియోజక వర్గం నుండి పోటీ చేస్తరా ? అన్న విలేఖరుల ప్రశ్నకు సారు దిమ్మదిర్గిపోయే జవాబిచ్చిండు. తెలంగాణల కాకుండా ఆంధ్రలున్న విజయవాడల గూడ పోటీ చేసినా నేను గెలుస్తనని మస్తు కాన్ఫిడెన్సు మీద చెప్తున్నడు. నిజమే సారుకు ఇక్కడా అక్కడా చాలా ఫాలోయింగు వున్నట్టుంది. ఇక్కడా అక్కడా.. ఎక్కడ నిలబడ్డా గెలవడం ఖాయం అంటున్నడు. కొంపదీసి అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని, తెలుగు రాష్ట్ర సమితిగా మార్చే ఆలోచనలో గులాబీ దండు లేదు కదా ? అనే సందేహాన్ని నెటిజనులు వ్యక్త పరుస్తున్నారు. ఇది గమ్మత్తుకు అన్నడా ? సీరియస్ గా అన్నడా అనే విషయం రాబోయే ఎలక్షన్ల నాటికి తేలిపోతది !