జగన్ 3 ఏండ్ల పరిపాలన..32 పథకాలు - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ 3 ఏండ్ల పరిపాలన..32 పథకాలు

May 21, 2022

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చి మే 30తో మూడు సంవత్సరాలు గడిచిపోతోంది. ఈ మూడేండ్ల పరిపాలనలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం 32 పథకాలను ప్రవేశపెట్టారు. 2019 మే 30న మొదలైన జగన్ పరిపాలన.. మూడు పువ్వులు-ఆరుకాయలు అన్నట్లుగా సాగుతోంది. ఇటీవలే గ్రామీణాభివృద్ధి, సుపరిపాలనలో వరుసగా రెండోవ సారి స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎంగా జగన్ ఎంపికైన విషయం తెలిసిందే.

ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను, సమస్యలను చూసిన జగన్.. తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేస్తూ, పరిపాలనలో ముందుకు సాగుతున్నారు. మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల రూపంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అమ్మ ఒడి , విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, నవరత్నాలు మొదలైన పథకాలను ప్రవేశపెట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సంఖ్య 129 కాగా, వాటిలో ఇప్పటివరకు 123 హామీలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.