ప్లీజ్ అర్థం చేసుకోండి.. అమరావతి రైతులకు నచ్చజెప్పిన జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్లీజ్ అర్థం చేసుకోండి.. అమరావతి రైతులకు నచ్చజెప్పిన జగన్

February 4, 2020

amaravati farmers.

పరిపాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని ఉద్యమిస్తున్న రైతులు ఈ రోజు సీఎంను కలిసి సమస్యలను వివరించారు. రాజధానిగా అమరావతిపై లక్ష కోట్లు పెట్టడం సరికాదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును, అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఒక తండ్రిలా నిర్ణయాలు తీసుకుంటున్నానన్నారు. వచ్చే మూడు నెలల్లో మంగళగిరి, తాడేపల్లిలో  అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రాజధాని గ్రామాల్లో భూ సేకరణ నోటిఫికేషన్‌ను, తాడేపల్లి పరిధిలో గత ప్రభుత్వం తెచ్చిన యూ 1 జోన్ ను ఎత్తేస్తానని హామీ ఇచ్చారు.

‘మేం ఎవరికీ అన్యాయం చెయ్యడం లేదు. శాసననిర్మాణ రాజధానిగా అమరావతి కొనసాగుతుంది. అయితే అమరావతి అటు విజయవాడకు గానీ, ఇటు గుంటూరుకు గానీ చెందదు. అక్కడ, సరైన రోడ్లు కూడా లేవు. మౌలిక సదుపాయాల కోసం ఒక ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం చేయాలి. లక్ష కోట్లపైనే ఖర్చు  పెట్టాలి. కానీ గత ప్రభుత్వం రూ. 6 వేల కోట్లే ఖర్చు చేసింది. మేం ఖర్చు చేసినా, ఐదేళ్ల తర్వాత ఏమవుతుంది? యువత ఉద్యోగాల కోసం మళ్లీ హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వెళ్తారు. అందుకు బదులుగా 10 శాతం ఖర్చు వైగాజ్‌లో పెడితే అది అభివృద్ధి చెందుతుంది..’ అని వివరించారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదని, తమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భూములు ధరులు పెరిగితే రైతులకు లాభం కలుగుతుందని అన్నారు.