చట్టం ముందు అందరూ సమానమే.. జగన్‌పై సీబీఐ మండిపాటు - MicTv.in - Telugu News
mictv telugu

చట్టం ముందు అందరూ సమానమే.. జగన్‌పై సీబీఐ మండిపాటు

February 13, 2020

Jagan

తాను సీఎంగా బిజీగా ఉన్నానని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాలేనని అంటున్న ఏపీ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, ఆయన బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఆక్షేపించింది. ప్రజావిధుల్లో ఉన్నానంటూ హాజరు మినహాయింపు కోరడం 14వ రాజ్యాంగ అధికరణకు విరుద్ధమని వివరించింది. హాజరు మినహాయింపు పొంది కోర్టు విచారణకు దూరం ఉండొచ్చా అని ప్రశ్నించింది. 

అక్రమాస్తుల కేసు విచారణలో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘వ్యక్తిగత హాజరు మినహాయింపు చాలా అరుదుగా ఇస్తారు. ఇది చాలా సున్నితమైన హైప్రొఫైల్ కేసు. మినహాయింపు నిందితుల హక్కు కాదు. దీనిపై కోర్టే నిర్ణయం తీసుకుంటుంది. చట్టం ముందు అందరూ సమానమే. జగన్ అభ్యర్థనకు కొట్టేయాలి..’ అని కోరింది.