నాలుగో రంగు లొల్లి.. జగన్ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

నాలుగో రంగు లొల్లి.. జగన్ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ

May 5, 2020

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రంగుల వ్యవహారంలో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. మూడు రంగులకు నాలుగో రంగును జోడిస్తూ అవి వివిధ విప్లవాలకు ప్రతీకలంటూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోను హైకోర్టు తోసిపుచ్చింది. దాన్ని నిలిపేయాలని, ఇదివరకు తామిచ్చిన ఆదేశాలను పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 

ప్రభుత్వ కార్యాలయాలకు తెలుపు, ఆకుపచ్చ, నీలి రంగులకు ఎర్రమట్టి రంగు జోడిస్తూ ప్రభుత్వం జీవో  623 జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు ఇది  విరుద్ధమంటూ కొందరు పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన కోర్టు కేసు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వం వైకాపా పార్టీ రంగులను అద్దుతూ నిబంధనలను తుంగలో తొక్కతోందని, ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలను మార్చారని విమర్శలున్న విషయం తెలిసిందే. దీంతో పాత రంగులను అలాగే ఉంచి, కొత్త రంగును జోడించింది. 

నేలకు ప్రతీకగా ఎర్రరంగు, పాడి పంటలకు ప్రతీకగా ఆకుపచ్చనీలి(ఆక్వా) విప్లవానికి ప్రతీకగా నీలం రంగుపాల విప్లవానికి ప్రతీకగా తెలుపు రంగులు వేయాలి. జాతీయ భవన విధానం ప్రకారం నడుచుకోవాలి. ఏ రాజకీయ పార్టీ రంగులను, చిహ్నాలను వొద్దుఅని ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే కొత్త రంగుల్లోమట్టి రంగు తప్ప మిగతావన్నీ వైకాపా రంగులే కావడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది