విభజన హామీలు నెరవేర్చాలి, మోదీ మనసు కరగాలి: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

విభజన హామీలు నెరవేర్చాలి, మోదీ మనసు కరగాలి: జగన్

June 14, 2019

Jagan demands Special category status to Andhra Pradesh.

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కునుందని జరుగుతున్న ప్రచారాన్ని పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తోసిపుచ్చారు. అలాంటి అసత్య ప్రచారం సరికాదని హితవు పలికారు. కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, నీతి ఆయోగ్ భేటీ కోసం ఆయన ఈ రోజు ఢిల్లీ చేరకున్నారు.

మొదట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆయనతో పలు అంశాలపై చర్చించానని జగన్ భేటీ తర్వాత మీడియాకు చెప్పారు. ‘విభజన హామీల అమలు హోం శాఖ పరిధిలోకి వస్తుంది కనుక అమిత్ షాను కలిశాను. ఆ హామీలను సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలని కోరాను. మోదీ మనసు కరిగించాలని కోరాను. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలోని అంశాలను హోం మంత్రికి వివరించాం. మా రాష్ట్రం కష్టాల్లో ఉందని, సాయం చేయాలని కోరాం. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో వివరిస్తూ ఓ లేఖను కూడా అందజేశాం. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటాం. రేపు(శనివారం) జరిగే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాను.. దేవుడి దయతో హోదా వచ్చేవరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటాం…’ అని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక సమర్పించనున్నారు.