Jagan gave green signal to those employees..but KCR is OK..
mictv telugu

ఆ ఉద్యోగులకు జగన్ గ్రీన్ సిగ్న‌ల్‌..కానీ, కేసీఆర్ ఓకే అంటేనే..

September 10, 2022

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గతకొన్ని సంవత్సరాలుగా ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ, ఎప్పుడెప్పుడు అంతరాష్ట్ర బదిలీలు జరుగుతాయని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నా ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. అంతరాష్ట్ర బదిలీల విషయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఓకే చెబితేనే ఈ ప్రక్రియ జరుగుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య బ‌దిలీల కోసం ప‌లువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్ర‌మంలో ఉద్యోగుల అంత‌ర్రాష్ట్ర బ‌దిలీల‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తెలంగాణ నుంచి కూడా ఈ బ‌దిలీల‌కు అనుమ‌తి ల‌భిస్తేనే, ఈ బ‌దిలీలు జ‌ర‌గ‌నున్నాయి. ఫ‌లితంగా ఏపీ నుంచి ఈ బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఉద్యోగులు ఇప్పుడు తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నారు.

”తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అటు నుంచి ఇటు..ఇటు నుంచి అటు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగులు వేల సంఖ్య‌లోనే ఉంది. ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 1,804గా ఉంది. ఇక తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల సంఖ్య‌ 1,338గా ఉంది. వీరంతా తమ త‌మ ప్ర‌భుత్వాల‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీ ప్ర‌భుత్వం స్పందించి అనుమ‌తి ఇచ్చింది. కానీ, తెలంగాణ‌ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మరోపక్క బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కారు ఎన్ఓసీలు ఇస్తోంది. ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాను ఏపీ ప్ర‌భుత్వం త్వరలోనే తెలంగాణ‌కు పంప‌నుంది.”