దేశంలోనే మొదటిసారి.. జగన్ ప్రభుత్వం ఘనత - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలోనే మొదటిసారి.. జగన్ ప్రభుత్వం ఘనత

March 9, 2022

 

0018

ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు అరుదైన ఘనత సాధించింది. పాలనా పరంగా దేశంలోనే మొదటి ర్యాంకును సాధించింది. పోలీసింగ్, వ్యవసాయం, సుపరిపాలన, గ్రామీణాభివృద్ధి, జిల్లా పాలనా యంత్రాంగం నిర్వహణ వంటి అంశాలు ఏపీని మొదటి స్థానంలో నిలిపినట్టు స్కాచ్ గ్రూప్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. కాగా, వరుసగా 2020, 2021 సంవత్సరాలలో ఏపీ మొదటి ర్యాంకు సాధించగా, ఈ ఘనత దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కకపోవడం విశేషం. రవాణా విషయంలో ఏపీ మూడో స్థానం సంపాదించింది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలు ముందున్నాయి. కాగా, వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతి, ఫలితాలను విశ్లేషించి స్కాచ్ గ్రూపు ర్యాంకులను కేటాయిస్తుంది. రిపోర్టు ప్రకారం ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలు స్టార్ పర్ ఫార్మర్‌గా, తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్‌లను పెర్ ఫార్మర్‌గా వాటి పనితీరు ఆధారంగా వర్గీకరించింది. ఈ వివరాలను రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.