జగన్ సంచలన నిర్ణయం.. రైతుల ఆందోళన  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సంచలన నిర్ణయం.. రైతుల ఆందోళన 

September 25, 2019

పలు వర్గాలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్న ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హయాంలో రైతులకు ప్రకటించిన రుణమాఫీ ఆదేశాలను ఏకపక్షంగా రద్దు చేశారు. దీంతో అప్పుల్లో కూరుకుపోయిన చిన్నసన్నకారు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై పగ ఉంటే మరోలా తీర్చుకోవాలని, తమకు అన్యాయం చేయొద్దని కోరుతున్నారు.

Jagan government.

టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 10న 4,5 విడతల రుణమాఫీకి సంబంధించి జీవో38 తీసుకొచ్చింది. దీన్ని వ్యవసాయ శాఖ బుధవారం రద్దు చేసింది. దాని స్థానంలో 99వ జీవోను పట్టుకొచ్చింది. దీంతో రూ.7959.12 కోట్ల రుణమాఫీ నిధులు  మిగిలిపోయాయి. వైకాపా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం తీసుకొస్తున్నందున పాత జీవోను రద్దు చేసినట్లు సమాచారం. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాన్ని మాఫీ చేశారని, తాము చెల్లించకుండా ఊరుకున్నామని, ఉన్నపాటున జీవో రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.