రైతులకు జగన్ మరో కానుక.. బోర్లతోపాటు మోటార్లు కూడా - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు జగన్ మరో కానుక.. బోర్లతోపాటు మోటార్లు కూడా

September 28, 2020

Jagan govt launches scheme to drill borewells free of cost for farmers.

మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలనే ప్రభుత్వాలు నెరవేర్చడం లేదు. అలాంటిది మేనిఫెస్టోలో లేని కొత్త వాగ్దానాలను కూడా జగన్ ప్రభుత్వం నిజం చేస్తోంది. ప్రజాసంక్షేమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా పథకాలను ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపీ రైతులకు జగన్ మరో వరం ప్రకటించారు. రైతులు అందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తామని.. చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు బిగిస్తామని ప్రకటించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జగన్ తెలిపారు. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేశానని అన్నారు. వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. రాష్ట్రంలో  లక్షల బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. 4 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

నియోజకవర్గానికి ఒకటి చొప్పున బోరు వేసే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాబోయే 30 ఏళ్లలో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకే మీటర్లు బిస్తున్నట్లు వివరించారు. రైతులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని లేదంటే వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. బోరు వేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని.. మొదటి బోరు విఫలమైతే రెండోసారి వేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ‘రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తాం. మేనిఫెస్టోలో లేకపోయినా సరే చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకు బోర్లతో పాటు మోటార్లు కూడా ఉచితంగా బిగిస్తాం. ఇందుకోసం అదనంగా రూ.1600 కోట్లు ఖర్చవుతుంది. ప్రతి నియోజకవర్గంలో బోరు రిగ్గు ఏర్పాటు చేశాం’ అని జగన్‌ తెలిపారు. కాగా, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేశామని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా 48 గంటల్లో విత్తనాల సరఫరా చేస్తున్నామని జగన్ స్పష్టంచేశారు.