ఏపీ హోంగార్డులకు అసలైన దీపావళి.. జీతం ఇక రూ. 21,300 - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ హోంగార్డులకు అసలైన దీపావళి.. జీతం ఇక రూ. 21,300

October 12, 2019

Jagan hikes home guards salaries 

అంగన్ వాడీ, ఆశా హెల్త్ వర్కర్లు తదితరులకు జీతాలను భారీగా పెంచిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో మరో సంచలన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు.  పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం హోంగార్డుల జీతాన్ని పంచేశారు. ప్రస్తుతం వారికి ఇస్తున్న రూ. 18వేల జీతాన్ని రూ. 21,300 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పెంపుపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేశారు. జగన్ మాటమీద నిలబడే మనిషి అని రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జె. శ్రీనివాసరావు కొనియాడారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేల ఆర్థిక సాయం అందించే వాహనమిత్ర పథకాన్ని జగన్ ఇటీవల ప్రారంభించడం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే  ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. గిరిజన సామాజిక, ఆరోగ్య కార్యకర్తల జీతం రూ. 400 నుంచి 4000లకు, మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల జీతం రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెరిగింది. రూ. 1000గా ఉండిన మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 3 వేలకు పెంచారు.