ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కారు కావాలంటూ తిరుమల వెళ్తున్న ప్రయాణీకులను దింపి కారు తీసుకెళ్లిన అధికారులపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని సహించబోమనే గట్టి సంకేతం అధికార గణంలోకి వెళ్లాలని ఖచ్చితంగా చెప్పారు. దీంతో ఒంగోలు ఏఎంవీఐ సంధ్య, హోంగార్డు తిరుపాల్రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి అందుకు తగిన చర్యలు తీసుకుంది.