Jagan is sweet for pensioners..just apply
mictv telugu

పింఛన్‌దారులకు జగన్ తీపికబురు..దరఖాస్తు చేస్తే సరిపోతుంది

September 26, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటున్న ఆయా జిల్లాల, మండలాల, గ్రామాల్లోని లబ్దిదారులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓ తీపికబురు చెప్పింది. ఇకపై పింఛన్ తీసుకునే లబ్దిదారులు..రాష్ట్ర పరిధిలో తమ పింఛనను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు వెసులుబాటును కల్పిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

విడుదల చేసిన ఉత్తర్వులో..”లబ్ధిదారులు మీ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలను సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, సరిపోతుంది. అలాగే, నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే, ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది.

అంతేకాదు, పింఛన్ల సొమ్మును దుర్వినియోగపరచడం, పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనుంది” అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలియజేశారు.