ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న లేదా జరగడానికి ఆస్కారమున్న అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళల కోసం దిశ ఆప్లాగా అవినీతిపై ఫిర్యాదులకు కూడా ప్రత్యేక యాప్, అదీ నెలరోజుల్లోగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం హోం శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ యాప్లో ఆడియో క్లిప్ కూడా పంపి ఫిర్యాదు చేయవచ్చు. అవినీతి కేసుల నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని జగన్ అధికారులకు సూచించారు. అంతేకాక, ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్లకే పరిమితమయిన ఏసీబీ కేంద్రాలను ఇక నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.