ఏపీ రైతులకు పండగ.. రైతు భరోసా ఇక 13,500 - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ రైతులకు పండగ.. రైతు భరోసా ఇక 13,500

October 14, 2019

Jagan mohan reddy  Andhra Pradesh farmers 

బడుగు బలహీన వర్గాలపై వరాల వర్షం కురిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులకు మరో శుభవార్త చెప్పారు. రైతు భరోసా పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.వ్య వసాయ అంశాలపై జగన్ ఈ రోజు  మంత్రులు, అధికారులతో సమీక్ష చేశారు. మొత్తాన్ని మరో వెయ్యి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కింద అందించే డబ్బును మూడు విడతలుగా అందజేస్తారు. జగన్ రేపు (మంగళవారం) నెల్లూరు జిల్లాలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. వచ్చే ఐదేళ్ల పాటు రైతులకు ఏటా రూ. 13,500 చెల్లిస్తామని వ్యవసాయ మంత్రి మంత్రి కన్నబాబు తెలిపారు. మే నెలలో రూ. 7,500, రబీలో రూ. 4000, సంక్రాంతికి రూ. 2000 ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా వర్తించదని చెప్పారు. జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచ్‌లు దీనికి అర్హులేనని వెల్లడించారు. పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్ ఒకటొకటే నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే.