జగన్ కు పవన్ సెగ ? - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ కు పవన్ సెగ ?

August 1, 2017

జగన్ కు పవన్ సెగ తగిలినట్టుంది. పార్టీ నిర్మాణంపై దృష్ఠి పెట్టాడు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా జనంతోనే వుండేలా జగన్ మోహన్ రెడ్డి కార్యాచరణను రూపొందించుకున్నరు. ఇప్పటివరకున్న పరీక్షలు చాలవన్నట్టు , ఇప్పుడు పడ్తున్న కష్టం సరిపోదన్నట్టు జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకు పరీక్షలు పెడుతున్నారు. ఇంటి మీదా – ఒంటి మీదా ఎన్నికల వరకు ధ్యాసను పక్కన పెట్టి కాన్ స్టెన్సీ మీద గట్టిగా కాన్ సన్ ట్రేషన్ చెయ్యాలని జగన్ మోహన్ రెడ్డి అడ్వైజరీ కమిటీ లీడర్లకు స్ట్రాంగ్ గా ఆదేశాలిచ్చాడు. సినిమాలకు పంగనామం పెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి సీరియస్ గా ఎంట్రీ ఇస్తానని చెప్పాక జగన్ బలగంలో ఈ కలకలం స్టార్ట్ అయింది. దీంతో జగన్ బాబు బృందం మరింత కసరత్తు పెంచింది.

13 జిల్లాల్లోని బూతు కమిటీ నుంచి రాష్ట్రస్థాయి వరకు భారతి సిమెంటులా పక్కా నిర్మాణం వుండాలని ప్లాన్ చేస్తున్నారు. జగన్ దీక్షలకు జనం తండోపతండాలుగా తరలి వచ్చినా ఓట్లు అనుకున్నంతగా రాలలేవు. అందుకే ఈసారి సంగీతాన్ని బాగా ప్రాక్టీస్ చేసి జనాల నుండి ఓట్లను దండిగా రాల్చుకుందామనే ప్లాన్ ను వేస్తున్నారు. 24/7 లీడర్లంతా జనంలోనే, జనంతోనే వుండాలని రూలింగ్ ఇచ్చారట. నాయకుల పని తీరుని వారానికి, నెలకు అంచనా వేసిన అడ్వైజరీ కమిటీ జగన్ బాబుకు రిపోర్టిచ్చిందట. ఇప్పుడు అటు ఆంధ్రా – ఇటు రాయలసీమ జిల్లాలకు కొత్త టెన్షన్ మొదలైనట్టే.