జనంలోకి జగన్..! - MicTv.in - Telugu News
mictv telugu

జనంలోకి జగన్..!

August 9, 2017

నంద్యాలలో ఉపఎన్నికల ప్రచారం నిర్విరామంగా చేయనున్నారు వైసిపి నేత జగన్.ఈనెల21 వరకు రెండు విడతలుగా ప్రచారం చెయ్యనున్నారట,నంద్యాలలో గల్లీ గల్లీకి రోడ్ షోలు నిర్వహించుకుంటూ పబ్లిక్ సమస్యలను గురించి తెలుసుకుంటూ, వాళ్లతో ఇంట్రాక్ట్ కావడానికి రెడీ అయ్యారట.పోయిన వారంలో నంద్యాల బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ఇప్పుడు నంద్యాల మండలం రైతునగర్ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం చేస్తారట.ఇదివర్కు జరిగిన నంద్యాల ఎన్నికల ప్రచారసభలో సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేందంటూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేగింది,జగన్ కు ఈసీ నుంచి నోటీసులు కూడా అందాయి.అయితే ఈ విషయంపై జగన్  ఈసీకి వివరణ ఇచ్చారు. కేవలం ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయనుందునే ఆవేదనతో అలా మాట్లాడాల్సివచ్చిందని చెప్పారట.చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. హామీల అమలులో చంద్రబాబు వైఫల్యం చెందారని, ఈ కారణంగానే మనస్తాపం చెంది.. చంద్రబాబుపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, స్వాతంత్ర్య వేడుకల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదన్నారు.మరి ఇయ్యాల్టిసంది జరిగే రోడ్ షోలో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో, ప్రభుత్వంపై జగన్ ఇంకెన్ని విమర్శలు చేస్తాడో.వైసిపి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి  విజయానికి ఎలా బాటలు వేస్తాడో చూడాలె మరి.