నాకు అధికార దాహం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

నాకు అధికార దాహం లేదు

December 6, 2017

జనసేన ఎన్నికల బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రంగంలోకి దూకాడు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు అధికారం దాహం లేదు. అధికారం విలువ, బాధ్యత నాకు తెలుసు. ముఖ్యమంత్రిని అయితేనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని నేను అందరిలా చెప్పను. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే అనుభవం ఉండాలి. ప్రజల తరఫున పోరాటం చేయడానికి అధికారమే అక్కర్లేదు’ అని అన్నాడు.సినిమా షూటింగ్ ముగించుకుని వచ్చిన పవన్ బుధవారం విశాఖలో పర్యటించాడు.  డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)ను ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలో పాల్గొని ప్రసంగించాడు.  డీసీఐ సమస్యకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నాడు.  ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశాడు.

‘ప్రజలు ఏ పార్టీ అంటే ఆ పార్టీతో కలిసి పనిచేస్తాను. ప్రజా సమస్యలను విస్మరిస్తే సమాధానం చెబుతాను..’ అని అన్నాడు. అయితే ఎన్నికల్లో జనసేన పోషించే పాత్ర గురించి ఆయన చెప్పకపోవడం విశేషం. 2014 ఎన్నికల్లో మాదిరే 2019 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చే అవకాశమున్నట్లు తాజా ప్రసంగం చెబుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.